![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -177 లో.....నువ్వు రాత్రంతా ధీరజ్ ని చూస్తూనే ఉన్నావ్ కదా.. నీ కళ్ళు చెప్తున్నాయని ప్రేమతో నర్మద అంటుంది. అక్క చూసినట్టు చెప్తుంది ఏంటని ప్రేమ మనసులో అనుకుంటుంది. నేనేం చూడలేదని ప్రేమ కవర్ చేస్తుంది. లేదు నువ్వు ధీరజ్ ని లవ్ చేస్తున్నావని నర్మద అంటుంది. అదేం లేదని ప్రేమ అంటుంటే ఇప్పుడు దీరజ్ బయటకు వస్తాడు కదా తన వంక చూడకపోతే నువ్వు లవ్ చెయ్యట్లేదు తన వంక చూస్తే చేస్తున్నట్లే అని నర్మద అనగానే సరే చూడనని ప్రేమ ఛాలెంజ్ చేస్తుంది.
ఆ తర్వాత ధీరజ్ కాలేజీ కి వెళ్లాడనికి బయటకు వస్తాడు. ప్రేమ తనని చూడదు.. అటు వైపు తిరిగి ఉంటుంది. తనని చూడకుండా పక్క నుండి వెళ్ళాలని వెళ్తుంటుంది. వెంటనే ప్రేమ పడిపోతుంటే.. ధీరజ్ పట్టుకుంటాడు. ధీరజ్ ని ప్రేమ చూస్తుంది. దూరం నుండి నర్మద వాళ్ళని చూస్తుంది. నేనేం చూడలేదని ప్రేమ నర్మదకి సైగ చేస్తుంది. ఆ తర్వాత ప్రేమని కాలేజీకి తీసుకొని వెళ్తాడు ధీరజ్. మరొకవైపు శ్రీవల్లి దగ్గరికి చందు వచ్చి డబ్బు గురించి అడిగితే తను భయపడి పని ఉందంటూ వెళ్తుంది.
అయిన చందు తన దగ్గరికి వెళ్లి మీ వాళ్లకు కాల్ చెయ్ డబ్బు కావాలని అడుగమని కోపంగా మాట్లాడుతాడు. భాగ్యంకి శ్రీవల్లి ఫోన్ చేసి డబ్బు గురించి అడుగుతుంది. పక్కన చందు ఉన్నాడని భాగ్యానికి అర్థమయి రెండు రోజుల్లో డబ్బు ఇస్తానని చెప్తుంది. రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే నేను ఇంటికి రానని శ్రీవల్లితో చందు అంటాడు. ఆ తర్వాత ప్రేమ ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ధీరజ్ జెలస్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |